అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార సరుకులు పంపిణీ...

Published: Thursday June 24, 2021
బీరుపూర్, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిత్యవసర పౌష్టికాహారం సరుకులు అందజేశారు. గర్భిణులు బాలింతలకు కోడిగుడ్లు నూనె పప్పు దినుసులు కురుకూరే బాలామృతం తదితర సరుకులను సర్పంచ్ సిపతి రమేష్ అంగన్వాడీ టీచర్ లక్ష్మీ అందజేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు బాలింతలు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యవతి సెక్రెటరీ రవి ఆశ వర్కర్ రజిత తదితరులు పాల్గొన్నారు.