ఉపాధి కూలీలకు నిధులు మంజూరు చేయాలి

Published: Saturday June 18, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 17 ప్రజాపాలన ప్రతినిధి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో పనులు చేసిన కూలీలకు డబ్బులు అందజేయడంలో మండల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కూలీలు మండుటెండల్లో పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా వారికి ఇంతవరకు డబ్బులు మంజూరు రాలేదన్నారు. అదేవిధంగా  టెంటు సౌకర్యం అందించలేదు మంచినీళ్లు సౌకర్యం కల్పించాలి ప్రమాదవశాత్తు అడిగితే మెడికల్ కిట్ లేని పరిస్థితి ఉందని కనీసం సదుపాయం కల్పించాలని  కనీసం 5 కిలోమీటర్లు ఉపాధి కూలీలు ప్రయాణించిన ఆటో చార్జీలు ఇవ్వలేదు ఆయన తెలిపారు. కూలీలా పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉపాధి కూలీలకు వారం వారం వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.