ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయించాలి

Published: Tuesday September 07, 2021
వికారాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : భారీ వర్షాల కారణంగా నాసిరకమైన ఆర్ అండ్ బి రోడ్లు అన్నీ ధ్వంసం అయ్యాయని వికారాబాద్ నియోజకవర్గ యుజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అన్నీ భారీ వర్షాలతో పాడవడంతో ప్రజలు గాయాలపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వాహనదారులు, బాటసారులు వరద ఉధృతితో తెగిన రోడ్లతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని స్పష్టం చేశారు. తెగిన రోడ్లకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు రోగాల బారిన పడితే తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు బాగు చేసి యధావిధిగా రాకపోకలు సాగేలా చూడాలని సూచించారు. రోడ్లు బాగు చేయలేని పక్షంలో వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.