రైతుల వరి కోత పొలాలను సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

Published: Saturday November 05, 2022

జన్నారం నవంబర్ 4 ప్రజాపాలన మండలంలోని లింగయ్య పల్లి, పొన్కల్ గ్రామలలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రైతుల వరి కోతకు దగ్గర ఉన్న వరి పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని రైతులతో మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన వడ్లను వడ్లు కొనుగోలు సెంటర్ లకు తీసుకురావాలని, సూచించారు. వరి పంటను కోసెప్పుడు హర్వెస్టర్ యొక్క ఫ్యాన్ ఆన్ చేసి తాలు రాకుండా చూడాలని తెలిపారు. గ్రామాలలోని రైతులు వరి పొలాలలో పూర్తిగా ఆరిన తర్వాతనే పంటను కొనుగోలు సెంటర్ కు తీసుకు రావాలని, అలాగే నాణ్యత ప్రమాణాలను రైతులు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య డిసిఎస్ఓ ప్రేమ్ కుమార్, ఏడిఏ అనిత, ఏవో ప్రభాకర్, ఏఈఓ లు త్రిసంధ్యా, మధు, సాయి, రైతులు, పాల్గొన్నారు.