కోటమర్పల్లిలో మునుగోడు విజయోత్సవ సంబరాలు

Published: Monday November 07, 2022
* మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య
వికారాబాద్ బ్యూరో 06 నవంబర్ ప్రజా పాలన : సీఎం కేసీఆర్ పాలనకు మునుగోడు విజయం గీటురాయిగా నిలిచిందని మర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య కొనియాడారు. ఆదివారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని బాణసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి రాజయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూరదృష్టితో ఆలోచించి ప్రతి సంక్షేమ పథకం నిరుపేదలకు అందే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడమే గెలుపుకు నాంది అని గుర్తు చేశారు. ప్రతి ఇంటా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదో ఒకటి లబ్ధి చేకూరుతున్నదని పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయుడని ప్రశంసించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకానికి లక్షా116 రూపాయలు కేటాయించి ఆడపిల్లల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజాభిమానం చురగున్నందున మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టారని అన్నారు. ఏ ప్రజా ప్రతినిధి అయిన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ అభ్యర్థులను ఎప్పుడూ మరువరని విశ్వాసం వ్యక్తం చేశారు. వయోవృద్ధులకు ఆసరా పెన్షన్లు వ్యవసాయదారులకు రైతుబంధు రైతు బీమా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు దేశంలోనే కీర్తింపబడుతున్నవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ జైహింద్ రెడ్డి వార్డు మెంబర్ 
జైహింద్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తహసీన్,  ఉపాధ్యక్షుడు రాజు,  అశోక్, తమ్మలి కృష్ణయ్య, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా రెడ్డి ,రవి, నర్సింహా, మంగలి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు టపకాయలు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది
 గ్రామ పెద్దలు యువకులు పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సంబరాలను సంతోషంగా జరుపుకున్నారు.