వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన సంవత్సరం ప్రత్యేక పూజలు

Published: Monday January 02, 2023
మధిర జనవరి 1 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఆదివారం నాడు  ఎరుపాలెం మండలం జమలాపురం పుణ్యక్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవస్థానం పండితులు నూతన సంవత్సరం సందర్భంగా  సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం యొక్క 2023 క్యాలెండర్స్ ఈరోజు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు  మరియు ఎర్రుపాలెం ఎస్సై సురేష్ ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పి.ఎ.సి.సి. చైర్మన్ మూల్పూరి శ్రీనివాస రావు , దేవస్థాన సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు ఉప్పల విజయదేవ శర్మ, క్యాలెండర్ ప్రింటింగ్ దాత వేజెండ్ల సాయికుమార్ మరియు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకు శ్రీ తుళ్లూరు కోటేశ్వర్ రావు, నిర్మల దంపతులు తూర్పు ద్వారం వద్ద పులిహోర ప్రసాదము, రవ్వ కేసరి ప్రసాదము పంచడం జరిగినది. అనంతరం దేవస్థానం యొక్క నరేంద్ర సత్రం ఆవరణలో సుమారు పదివేల మంది భక్తులకు దొండపాటి పూర్ణ చందర్రావు. ప్రభావతి  దంపతులు కంభంపాడు వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40 మంది పోలీసు సిబ్బందితో ఎర్రుపాలెం ఎస్సై యం.సురేష్  బందోబస్తు నిర్వహించడం జరిగినది. మరియు 200 మంది సత్య సాయి సేవా సమితి సభ్యులు భక్తులకు వివిధ సేవలు అందించినారు. 
అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగినది.