చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Published: Thursday June 09, 2022
ప్రజల్లో అవగాహన కోసం  సర్కిల్ కార్యాలయం గోడలపై ఛాయాచిత్రాలు ఏర్పాటు
ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఛాయాచిత్రాలు
మధిర సిఐ మురళి  పని విధానాన్ని మెచ్చుకుంటున్న అధికారులు ప్రజలు మధిర జూన్ 8 ప్రజా పాలనప్రతినిధి పరిధిలో స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం మధిర సిఐ వడ్డేపల్లి మురళి  మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయం గోడలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ప్రజలకు పోలీస్ శాఖ నిరంతరం రక్షణ కల్పిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనే ఈ విషయాన్ని ఛాయాచిత్రం ద్వారా మధిర సిఐ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను గుర్తు చేస్తూ ఏర్పాటుచేసిన పోలీస్ అమరవీరుల స్తూపం యొక్క చిత్రపటం ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి అదేవిధంగా ఆపదలో ఉన్నవారు 100కి ఫోన్ చేస్తే తక్షణమే పోలీసులు వచ్చి వారిని కాపాడతారని చెప్పే చిత్రపటం సైతం ఏర్పాటు చేశారు మహిళలను వేధింపులకు గురిచేస్తే షీ టీమ్ని సంప్రదించాలని చెప్పే చిత్రపటాన్ని బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్పే చిత్రపటాలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాల గురించి చాలా చిత్రాల ద్వారా వివరించారు