5 ఏకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలి - ఎమ్మార్పీఎస్

Published: Wednesday June 02, 2021
జగిత్యాల, జూన్ 1 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ దుమాల గంగారాం మాదిగ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 5 ఎకరాలలోకు ఉన్న రైతులకు మాత్రమే రైతుబందు పథకం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. వందల ఎకరాలు ఉన్న భూస్వామికి రైతుబంధును రద్దు చేయాలని అన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వందల వేల ఎకరాల భూస్వాములకు రైతుబంధును నిలిపివేసి ఆ బడ్జెటును కరోనా చికిత్స కోసం ఆరోగ్యశ్రీకి కేటాయించాలని సలహా ఇచ్చారు. కరోనా వారియర్స్ పారిశుద్ధ్య కార్మికులు ఆశ వర్కర్స్ అంగన్వాడి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. ఆస్తులు లేని కడు బీద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిల్లో వైద్యంకోసం తాళి పుస్తలు అమ్ముకొంటు వైద్యం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైద్యం పేరుతో కార్పొరేట్ ఆసుపత్రిలు చేస్తున్న దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని గంగారాం మాదిగ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి పడిగెల మల్లయ్య మాదిగ సారంగాపూర్ మండల ఇంచార్జి బెజ్జంకి సతీశ్ మాదిగ బోనగిరి కిషన్ మాదిగ దుమాల పెద్ద గంగారం మాదిగ నక్క సతీష్ మాదిగ బొల్లె అనిల్ మాదిగ మీసాల సాయిలు మాదిగ పాల్గొన్నారు.