ఘనంగా పొట్టి శ్రీరాములు70వ వర్ధంతి **

Published: Friday December 16, 2022

 

నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్యలు **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 15 (ప్రజాపాలన, ప్రతినిధి) : పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి ని వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌక్ లో "పొట్టి శ్రీరాములు విగ్రహానికి" పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటులో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ వాసవి క్లబ్,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా ప్రమోద్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జైంట్ సెక్రెటరీ  ఎక్కిరాల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు కొడిపాక రవీందర్, ఆర్య వైశ్యులు చెట్ల ప్రశాంత్, గుండా నాగేశ్వర్,గోగుల శ్రీనివాస్,పాత విశాల్, సభ్యులు పాల్గొన్నారు.