రాళ్ళచిట్టంపల్లి పాఠశాలను పట్టించుకోండి సారూ...!

Published: Tuesday July 27, 2021
వరుసగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి
గ్రామ సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ బేగమ్ గౌస్
వికారాబాద్ 26 జూలై ప్రజాపాలన బ్యూరో : శిథిలావస్థకు చేరిన పాఠశాలను బాగుచేసి ఉపాధ్యాయుల విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని రాళ్ళచిట్టంపల్లి గ్రామ సర్పంచ్ ముఫ్లయా యాస్మిన్ బేగం గౌస్ పాఠశాల ఉపాధ్యాయుడు మహమ్మద్ ఇబ్రాహిం కోరారు. గత వారం రోజుల నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల గదులన్నీ తడిసి మద్దవుతున్నాయి. సోమవారం జిల్లా పరిధిలోని వికారాబాద్ మండల పరిధికి చెందిన రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో పాఠశాల స్థతిగతులను పరిశీలించారు. ప్రతి తరగతి గది చిన్నపాటి వర్షానికే చిన్న తటాకాలను తలపిస్తుంది. కరోనా కారణంగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండడంతో ప్రమాదం తప్పింది. తరగతులు రెగ్యులర్ గా కొనసాగితే మాత్రం ప్రమాదపుటంచులో ఉంటారు. సంబంధిత విద్యాధికారులు, రాజకీయ ప్రతినిధులు స్పందించి రాళ్ళచిట్టంపల్లి పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.