నూతన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి శుభాకాంక్షలు

Published: Tuesday February 07, 2023
* జిల్లా వీఆర్ఏ జేఏసీ నాయకులు
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి కి శాలువా కప్పి పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపామని జిల్లా విఆర్ఏ జెఏసి నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వికారాబాద్ జిల్లాలో వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, ఇసుక దిబ్బల దగ్గర డ్యూటీలు ఒక కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయాల్లో వీఆర్ఏలతో అదనపు పనులు చేయించకూడదని వినతి పత్రం ఇచ్చమని స్పష్టం చేశారు.