వరద బాధితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా

Published: Friday November 04, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

 ప్రజలు ఎప్పటి నుండి టెంట్ వేసుకుని అటవీ ప్రాంతం లో ధర్నా చేపట్టడం జరిగినది దీనికే న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం జరిగినది.మొన్న వచ్చినటువంటి వరదలకు  ఆస్తి నష్టం సంభవించిందని అయితే కేసీఆర్  ముంపు ప్రాంతానికి గురైనటువంటి ప్రజలందరికీ కూడా ఎత్తైన ప్రదేశంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారని దానికి అనుగుణంగానే మాకు సర్వేనెంబర్ 210 లో 820 హెక్టార్లు ఉందని దానిని పేద ప్రజలకు పంచి ఇవ్వవలసిందిగా న్యూ డెమోక్రసీ ఎంఎల్ చెప్పినది. కెసిఆర్ ప్రభుత్వం చెప్పినట్లుగా మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు ధర్నా చేపట్టడం జరిగినది. దీనికి న్యూ డెమోక్రసీ ఎంఎల్ మద్దతు ఇచ్చినారు. ముంపు ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.