జిన్నారం లో టిఆర్ఎస్ అవిర్బవ దినోత్సవ వేడుకలు

Published: Wednesday April 28, 2021

జిన్నారం, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు పార్టీ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2001లో పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ మూన్నాళ్ళ ముచ్చటే అంటూ చాలా మంది చాలా రకాలుగా హేళన చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో సత్యాగ్రాహం చేసి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వ్యక్తి కేసీఆర్ అని, అలాగే ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ దక్కిందని కొనియాడారు, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఈ 7 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోవు రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు, అదేవిధంగా కరోనా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు సామాజిక దూరం పట్టిస్తూ, మస్కులు ధరించి, కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో అండూరు సర్పంచ్ ఖాదీర్, జిన్నారం ఉప సర్పంచ్ సంజీవ, సింహ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, క్రిష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ గౌడ్, బ్రాహేందర్ గౌడ్, లింగం, రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యదయ్య, బీంరావు, నర్సింగ్ రావు, నిఖిల్ గౌడ్, ప్రవీణ్, యాదయ్య, విఠల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు