కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కల్వకుంట్ల సంజయ్

Published: Saturday December 31, 2022

కోరుట్ల , డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కల్యాణ లక్ష్మి 28 చెక్కులు షాదీ ముబారక్ 11 చెక్కులను మొత్తం 39 చెక్కులు 39 లక్షల 4524 రూపాయలను లబ్ధిదారులకు అందించారు. మరియు పేద ప్రజల హాస్పిటల్ ఖర్చుల భారాన్ని తగ్గించడానికి సీఎం సహాయ నిధి నుంచి అందిస్తున్న 26 చెక్కులు ఆరు లక్షల 86వేల రూపాయల విలువగల చెక్కులను శుక్రవారం రోజున  కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  లబ్ధిదారులకు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు,ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మరియు మండల అధ్యక్షులు అన్నం అనిల్,దారిశెట్టి రాజేష్,మరియు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.