జంతు సంక్షేమం ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి . జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Saturday January 21, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 20 ప్రజా పాలన ప్రతినిధి) : 
జంతు సంక్షేమం ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జంతువుల సంక్షేమానికి సంబంధించిన సంక్షేమం ప్రజలు బాధ్యతగా తీసుకోనే చర్యలను సూచిస్తూ జంతు హింస నివారణ సంఘం వారు రూపొందించిన కరపత్రాలను జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పేయిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వీధులలో తిరిగే వాటికి మానవ దృక్పథంతో ఆహారం అందించాలన్నారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. జంతు సంరక్షణలో ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సంస్థలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సురేష్, ఏఎస్పి భీమ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.