సమస్యాత్మక ప్రాంతాల్లో గ్రామ సభలకు పోలీస్ బందోబస్తు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ *

Published: Thursday November 24, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : పోరు భూములకు సంబంధించి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో గ్రామసభల నిర్వహణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. బుధవారం అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్యను నిర్వహిస్తూ అటవీ అధికారులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అటవీ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోడు భూముల గ్రామసభలకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించినట్లు వివరించారు. రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్యకు గురికావడం బాధాకరమని తెలిపారు.
 ఇదే సందర్భములో అటవీ అధికారులు కల్పించుకుని ప్రజల దృష్టిలో మమ్మలను అపరాధులను చేయకూడదని సూచించగా పోడు భూముల పట్టాలు ఇవ్వడం అటవీ అధికారుల పని కాదని, కలెక్టర్ స్థాయిలో పట్టాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.ఇదే విషయాన్ని గ్రామ సభల్లో కూడా సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్, టిఎన్డిఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోచయ్య, రాజశేఖర్, అటవీ రేంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.