మంత్రి సబితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ అభిమానులు

Published: Thursday May 06, 2021
బాలపూర్, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ అభిమానులు యువకులు ప్రజలు మెచ్చిన నాయకురాలు అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు యువకులు టిఆర్ఎస్ అభిమానులు మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి పూల బుగ్గే ఇచ్చి తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.... కార్పొరేషన్ నుంచి అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, బిమిడి స్వప్న జంగారెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, ఏనుగు రామ్ రెడ్డి, పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, శివ కుమార్, బిసి సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, పవన్ కుమార్, శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పి. సంతోష్, కర్రే  బల్వంత్, కే. కిష్టన్న, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.