అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజాయ్ కుమార్

Published: Friday April 23, 2021
జగిత్యాల, ఏప్రిల్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని 33వ వార్డులో సిసి రోడ్డు మరియు డ్రైనేజీలుపై ఆర్సీసి స్లాబ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం తడి పోడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి వార్డులో ఇంటింటికి గోడలపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు తయారు చేయించి అన్ని వార్డుల్లో అతికించి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది పెంపు వాహనాల పెంపు డీజిల్ భారం లాంటి సమస్యలు ఉత్పన్నమై చివరికి పట్టణ ప్రజలపై ఆర్థిక భారంపడే అవకాశం ఉందన్నారు. చైర్పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ కరోనా కారణంగా సుమారు ఎనిమిది నెలల అభివృద్ధి కుంటు పడిందని ప్రస్తుతం పట్టణ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కమిషనర్ మారుతి ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ బండారి రజని నరేందర్ కౌన్సిలర్లు కుసరి అనిల్ కోరే గంగమల్లు పిట్ట ధర్మరాజు నాయకులు కూతురు శేఖర్ వోళ్లెం మల్లేశం కత్రోజు గిరి పుల్ల మల్లయ్య పుల్ల గట్టయ్య డిఈ లచ్చిరెడ్డి ఏఈ ఆయుబ్ ఖాన్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.