వ్యవసాయ కార్మక సంఘం మండల కమిటీ ఎన్నిక

Published: Wednesday October 19, 2022
జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జెండాను మంగళవారం కూకటికారు బుచ్చయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  వ్యవసాయ కార్మిక సంఘం రెండవ మండల మహసభ నిర్వాహించి, నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు గుడ్ల రాజన్న, ఉపాధ్యక్షురాలు దుర్గం లక్ష్మి, కార్యదర్శి వొడిపల్లి అంజయ్య, కోశాధికారి కోడిపల్లి ప్రమీల, సహాయ కార్యదర్శి మగ్గిడి జయ, 23 వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు ఎన్నికైయ్యారు. సిఐటియు ఆఫీస్ ఆవరణలో మండల వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు గుడ్ల రాజన్న అన్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా కనికరపు అశోక్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరైనారు. వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై ఆధారపడి న వ్యవసాయ కూలీలు 60 శాతం ఉన్నారని, వీరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు కేంద్రం సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని వ్యవసాయ కార్మికునికి సాగుభూమి ఇవ్వాలని, ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్నారని పాలకులకు పేదల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛన్లు వంటి సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి భవిష్యత్తులో ఈ డిమాండ్ల సాధనకై ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.
 
 
 
Attachments area