పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

Published: Thursday June 17, 2021

౼ టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్
జిన్నారం, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నేడు గురుకుల పాఠశాల సమీపంలో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కేసీఆర్ దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం సాగుతోంది అని, భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర, మానసికొల్లాసం కలిగించే వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతోనే హరితహారం కార్యక్రమాని సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్టంలో అటవీ విస్తీర్ణం 24% నుండి 29% శాతానికి పెరిగిందన్నారు. మరో విడత హరితహారం కోసం గ్రామాల్లో నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం మన సామాజిక బాధ్యత అని, మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. కావున ప్రతిఒక్కరు తప్పనిసరిగా, విరివిగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం సామాజిక బాధ్యత  మొక్కలు నాటాడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్దవి చేసే బాధ్యత తీసుకోవాలని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, నర్సింగ్ రావు, చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.