ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా సర్పంచ్ బూడిద రాంరెడ్డి జన్మదిన వేడుక

Published: Wednesday April 05, 2023

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త బూడిద రాంరెడ్డి 52వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఆటోనగర్ లో ఆయన కార్యాలయం వద్ద లారీ అసోసియేషన్ సమక్షంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మంగళవారం జరిగాయి. జన్మదిన వేడుకల కు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు హాజరై గజమాలలు, పూల బొకేలు శాలువాలతో సత్కరించి  కేక్ కట్ చేసి రామ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి సోదరుడు బూడిద నందా రెడ్డి, ఉప్పరగూడ ఉప సర్పంచ్ బూడిద నర్సింహ్మరెడ్డి, ఇబ్రహీంపట్నం పత్రికావిలేకరులు, కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు.