రంగాపురం లో ఆట స్థలానికి కేటాయించిన స్తలాని రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్

Published: Tuesday June 14, 2022
మంచాల తహశీల్దార్ కర్ర అనితకు వినతి పత్రం సమర్పించారు. రంగాపుర్ గ్రామనికి చెందిన ఆరగంటి వెంకయ్య కుమారులు పరమేష్, రాములు, గిరి ప్రసాద లు గత 30 యేండ్లు నుండి సర్వే నెంబర్ 126/37 మూడు ఏకురాల్లో  ఐదు కుటుంబాలు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఆట స్థలానికి దళితుల బూములు తీసుకోవడం సరియింది కాదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య అన్నారు. ఈ భూమిలో చనిపోయిన వెంకయ్య సమది కూడ ఉందని. గత ఏడాది వర్షాధార పంటలైన కందులు, జొన్నలు సజ్జలు వేశారని. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను వెనకి తీసుకోనీ దళితులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులూ కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, పరమెష్, రాముల, గిరి ప్రసాద్ పాల్గొన్నారు.