కొత్తగడి హనుమాన్ మందిర్ లడ్డూ వేలం పాట 81 వేలు

Published: Monday September 20, 2021
వికారాబాద్ బ్యూరో 19 సెప్టెంబర్ ప్రజాపాలన : కొత్తగడి శ్రీ హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు పది రోజుల పాటు నిత్యపూజలు అందుకున్నాడు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో శ్రీ హనుమాన్ యువజన సంఘం వినాయక లడ్డూను ఎర్రవల్లి శ్రీశైలం 81 వేల రూపాయలకు వేలం పాట ద్వారా దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఎర్రవల్లి శ్రీశైలం మాట్లాడుతూ..గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటతో పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. లడ్డూ ప్రసాదం పొందడంతో ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ చింతలబొగుడ రాజమల్లయ్య మాట్లాడుతూ.. వినాయక చవితి నుండి నేటి వరకు అనునిత్యం పూజలు అందుకున్న గణనాథున్ని నేడు నిమజ్జనం చేయనున్నామని పేర్కొన్నారు. నిమజ్జనం కంటే ముందు రోజు మహాన్నదానం (శనివారం) నిర్వహించామని ఉద్ఘాటించారు. శ్రీ హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాదం భక్తులకు అందించడం గర్వకారణమని కొనియాడారు. చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీమంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రాఘవన్ నాయక్, కొత్తగడి పిఏసిఎస్ చైర్మన్ కె.కె.నర్సిములు, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్, యూత్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఊరడి మల్లేశం ముదిరాజ్, సభ్యులు భీమయ్య, శేఖర్, నాగేష్, రాజు, మురారి, జగదీశ్, లక్ష్మణ్, యువజన సంఘం సభ్యులు, కొత్తగడి గ్రామస్థులు పాల్గొన్నారు.