ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

Published: Tuesday March 16, 2021
ఎల్.ఎమ్ కొప్పుల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ స్నేహలత
వెల్గటూర్, మార్చి 14 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎల్.ఎమ్ కొప్పులచారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం లోని ఎండపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని ఎల్.ఎమ్ కొప్పుల ట్రస్ట్ చైర్మన్ స్నేహలత రోగ చికిత్స కన్నా రోగ నిర్ధారణ ముఖ్యమని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటిరోజు హెల్త్ క్యాంపు లో స్క్రీనింగ్ చేసి అవసరమైనవారికి బుధవారం రోజు హెల్త్ క్యాంపు లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా తదుపరి వైద్య సేవల అవసరమైతే నంగునూరు లోని ప్రతిమ హాస్పిటల్ సిఫారస్ చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్, చిన్నపిల్లల, ఎముకల, కంటి, రేడియో లజీ, స్త్రీ వైద్య నిపుణులు, ఈ శిబిరానికి వస్తున్నట్లు తెలియజేశారు. ఈ.సీ.జీ, ఆర్.బి.ఎస్, సి.బి.పి, వైడల్, ఎం.పీ, ఎలక్ట్రో కార్డియాలజీ, సి.ఆర్.పి, సిరమ్ క్రియాటిన్, బ్లడ్ యూరియా, ఎక్స్-రె తదితర పరీక్షలు అవసరం ఉన్నవారికి నిర్వహిస్తామని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ స్నేహలత తెలియజేశారు.