ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్

Published: Tuesday December 07, 2021
మంచిర్యాల బ్యూరో , డిసెంబర్ 06, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయసే వాధికార సంస్థ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈనెల 11 తేది శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను మంచిర్యాల జిల్లా కోర్టులలో, లక్షేట్టి పేట్, బెల్లంపల్లి, చెన్నూర్ కోర్టులలో నిర్వహించబడుతుం దని అదనపు రెండవ జిల్లా నాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ డి.వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, నేరుగా కోర్టు ప్రాంగణంలో గానీ లేదా చూసించిన ప్రాంతంలో గానీ పరిష్కరించే విధంగా అన్ని వసతులను, సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలునుబట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, ప్రీ- లిటిగేషన్ కేసులు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించు టకు సిద్ధంగా ఉన్నాం అని వారు అన్నారు. కావున ఈ నేల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
జిల్లా జడ్జి కి ఘనస్వాగతం
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయసే వాధికార సంస్థ మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల బార్ అసోసియేషన్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశానికి  జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ రామకృష్ణ ప్రనీతి హాజరైన నేపథ్యంలో స్థానిక బార్ అసోసియేషన్ అద్వార్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈనెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పై చర్చించారు. ఈ సమావేశంలో రెండవ జిల్లా నాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ డి.వెంకటేష్ తో పాటు ఇతర నాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.