రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారం అతిపెద్ద కుంభకోణం..

Published: Friday May 27, 2022
పాలేరు మే 26 ప్రజాపాలన ప్రతినిధి
ఆరుగాలం కస్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో కోర్రిలు పెట్టి దగా చేస్తున్నారని సి ఎల్పి  నేత బట్టి విక్రమార్క అన్నారు. 
 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి 
లోని దాచేపల్లి, ఇతర పలు చోట్ల ఉన్న ధాన్యం కోనుగోలు
కేంద్రాలను   భట్టి విక్రమార్కగురువారం పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి  సమస్యలను  తెలుసుకున్నారు.ఈ సందర్భంగా భట్టి ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి దేశ పర్యటనలు చేయటం సిగ్గుచేటన్నారు. 
.మిల్లర్లు,అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై రైతుల సొమ్ము దోచుకుంటున్నారని  ఆరోపించారు..ప్రభుత్వం  కొనుగోలు చేసిన ధాన్యన్ని మిల్లర్లు తరుగు పేరుతో 4 నుండి 10  కేజీలు కోత విధిస్తున్నారని  
మిల్లర్లు,రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలిసి పంచుకునే అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని బట్టి ఆరోపించారు. 
ఈ కార్యక్రమంలో ఖమ్మం పిసిసి అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు,పోట్ల నాగేశ్వరరావు,
 జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి సర్పంచ్ రాయపుడి నవీన్,
 పాలేరు నియోజకవర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన  కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు