9 10 వార్డులో ఘనంగాపింగళి వెంకయ్య జయంతి వేడుకలు

Published: Wednesday August 03, 2022

మధిర రూరల్ ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో 9 10 వార్డులు పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినమధిర మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత.స్థానిక సుందరయ్య నగర్ 9 10 వార్డులో విశ్రాంత ఆచార్యులు సముద్రాల లక్ష్మీపతి రావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పింగళి వెంకయ్య జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనీ జాతీయ జెండాని ఆవిష్కరించిన స్థానిక కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి జాతీయ జెండాగా త్రివర్ణ పతాకాన్ని అందించిన తెలుగు వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. 1913 వ సంవత్సరంలో జరిగిన ఒక సభలో అనర్గళంగా పూర్తి ఉపన్యాసాన్ని జపాన్ భాషలో ప్రసంగించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు అని అంతేగాక భారతదేశ రైతులని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి కాంబోడియా కాటన్ అనే పత్తి రకం పైన విస్తృతమైన పరిశోధనలు చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త కూడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరుకు ళ్ళ లక్ష్మీనరసింహారావు, పుల్ల ఖండం చంద్రశేఖర్, హారి బాబు, కర్నాటి అశోక్, కుంచం కృష్ణారావు , పరుచూరి బోస్ పాల్గొన్నారు.