ఉపాధ్యాయులు చేడే శ్రీనివాస్ చొరవతో నిరుపేద ప్రతిభా విద్యార్థినికి చరవాణి బహుకరణ

Published: Friday January 28, 2022
మధిర జనవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మధిర మండలం దెందుకూరు గ్రామంలో దెందుకూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ప్రతి ఆదివారం మథిరలో గల కుందా సావిత్రి సేవాసమితి నందు నిర్వహిస్తున్న ఉచిత హోమియో వైద్యశాలలో వాలంటీర్ గా సేవలందిస్తున్న నిరుపేద ప్రతిభ విద్యార్థిని కుమారి రిషిత యొక్క ఆర్థిక పరిస్థితి గమనించిన ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ తన మిత్రులైన రైల్వే ఉద్యోగి విజయ్ మరియు శ్రీ సాయి వాసవి బేకరీ ఆర్.వి కాంప్లెక్స్ వారు అందించిన ఆర్థిక సహకారంతో మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ చేతుల మీదుగా చరవాణిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాస్, మేడేపల్లి శ్రీనివాస్, బొగ్గవరపు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.