అంబేద్కర్ యూనివర్సిటీ లో అడ్మీషన్ కొరకు విద్యార్థుల అవస్థ లు

Published: Tuesday September 13, 2022
హైదరాబాద్ 12 సెప్టెంబర్ ప్రజాపాలన: డిగ్రీ, పిజీ కోర్సుల్లో ప్రవేశం కొరకు అంబెడ్కర్ యునివర్సిటీ  విద్యార్థుల పాట్లు. యునివర్సిటీ లో 
ఇంటర్ నెట్ సరిగా పనిచేయక పోవడంతో విద్యార్థులు ప్రవేశం కొరకు అప్లై చేసుకున్నా వెరిఫికేషన్ కోడ్ మెసేజ్   రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు‌. దీనికి తోడు వరుసగా సెలవులు రావడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పిజీ కోర్సుల్లో  ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సమీపంలో ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. యునివర్సిటీ లోని మీ సేవ కేంద్రంలో మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌంటర్ లో విద్యార్థులు బారులు తీరారు. సమయం వృధా అవుతుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసాలకు  ఓర్చి యునివర్సిటీ కి వచ్చినా సకాలంలో  పని జరుగక పోవడంతో  అధికంగా ఖర్చుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వికలాంగులు మహిళలు దూరప్రాంతాల నుంచి వచ్చి అడ్మీషన్ కొరకు లైన్ లో అవస్థలు పడుతున్నారు. అన్ని  స్టడీ సెంటర్ల లో ఇదే తీరు ఉందని విద్యార్థులు అంటున్నారు. అడ్మీషన్ విషయం లో   స్టడీ సెంటర్ల కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా మీ అప్లికేషన్ ను అనుమతించాం ఫీజు పే చేయవలసింది గా సమాధానం చెబుతున్నారు.అడ్మీషన్   ఫీజు పే చేయాలని వెబ్ సైట్ లో చూస్తే ఇన్ వాలీడ్  అప్లికేషన్ అని కనిపిస్తుంది. యస్.ఎమ్. ఎస్. రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.   యునివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయం లో విద్యార్థుల ఇక్కట్లను తొలగించాలని అవసరం అయినప్పుడు ఎక్కువ కౌంటర్లను తెరవాలని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు.