బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి

Published: Wednesday May 25, 2022
నస్పూర్, మే 24 ప్రజాపాలన ప్రతినిధి:  వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అడ్వైజర్ మైనింగ్ డిఎన్.ప్రసాద్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సూర్యనారాయణలు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని  వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఉపరితల గనిలో నిరంతరం బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలని దానికి సంబంధించి అన్ని ప్రణాళికలను ముందస్తుగా చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సుశి కాంట్రాక్టు కాలపరిమితి ముగుస్తున్నందున దానికి అనుగుణంగా కొత్త కాంట్రాక్టు ఇవ్వడానికి అవసరమైన చర్యలపై సమీక్షించారు. బొగ్గు నిల్వలు, బొగ్గు రవాణాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. క్వారీ నడపడానికి అవసరమైన, డంపింగ్ చేయడానికి కావలసిన ఆర్ అండ్ ఆర్ గ్రామాల తరలింపు ప్రదేశాలను ప్రత్యక్షముగా పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను రివ్యూ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి.సంజీవ రెడ్డి, ఎస్ఓ టూ జీఎం గుప్తా, శ్రీరాంపూర్ ఓసీ  ప్రాజెక్ట్ ఆఫీసర్ వి.పురుషోత్తమ రెడ్డి, ఇందారం  సీ ప్రాజెక్ట్ ఆఫీసర్  రాజేశ్వర్ రెడ్డి, గని మేనేజర్ కే.జనార్ధన్, ఇన్చార్జి క్వాలిటీ కే.వెంకటేశ్వర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ చంద్రశేఖర్, గని సర్వే అధికారి సంపత్  పాల్గొన్నారు.