సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి

Published: Monday December 05, 2022

బోనకల్ , డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి :ఈనెల 10వ తేదీన బోనకల్లో జరుగుతున్న మధిర నియోజకవర్గస్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక బోనకల్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం మధిర నియోజకవర్గ స్థాయిలోని సిపిఐ కార్యవర్గ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ గతంలో జరిగిన సిపిఐ రాష్ట్ర, జాతీయ సాయి మహాసభల తీర్మానలు, నిర్ణయాలను క్రింది స్థాయి కేడర్ అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గం నిర్వహించినట్లు వారు తెలిపారు. బోనకల్ కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జనరల్ బాడీ సమావేశం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేద ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మనదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గించడం లేదన్నారు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మనదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేవారు అన్నారు. ధరలు పెరిగినప్పుడు ఒకలా తగ్గినప్పుడు మరోలా వివరించడం ఏంటని వారి ఈ సందర్భంగా విమర్శించారు. మోడీ పరిపాలనలో సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని పంటలు పండించే రైతులు, శ్రమొచ్చి సంపద సృష్టించే కార్మికులు ఇంకా, ఇంకా శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కానీ కార్పొరేటర్ శక్తులు ఆదాయం మాత్రం రోజురోజుకు పెరిగి పోతుందన్నారు. ఈ దూపిడి విధానాన్ని ప్రజలకు తెలియ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పటు చేశామన్నారు. నియోజకవర్గ పరిధిలోని చింతకాని, బోనకల్, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం తదితర మండలాల నుండి సిపిఐ కార్యకర్తలు సభ్యులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, బెజవాడ రవి బాబు, ఏపూరి రవీంద్ర బాబు, మందడుపు రాణి, బోనకల్ మండల్ కార్యదర్శి యంగల ఆనంద రావు లు పాల్గొన్నారు.