నిరుపేద వితంతు మహిళకు చేయూత

Published: Monday May 24, 2021
ఇంటి రేకులు నిమిత్తం ఆర్థిక సహాయం నెలకు సరిపడ బియ్యం పంపిణికొండయ్య చొర్వతో ముందుకొచ్చిన దాతలు
మధిర, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : ఉదయం ప్రముఖ సామాజిక సేవకుడు లంకా సేవాఫౌండేషన్ నిర్వహ కులుమధిర ఆశ మిత్ర లంకా కొండయ్య నివాస ప్రాంగణం మధిర ఆజాద్ రోడ్డు నందు ఆదివారం ఉదయం 9 గంటలకు మండలంలో ఒక గ్రామంలో భర్త చనిపోయి పెద్ద బిడ్డ చనిపోయి చిన్న బిడ్డతో జీవనం కొనసాగిస్తున్న నిరుపేద వితంతు మహిళా దీనగాధ తెలుసుకున్న లంకా కొండయ్య వారి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఉండ టానికి సరైన ఇల్లు లేక ఉన్న కొద్ది స్థలంలో చిన్నగది ఇటుకలతో నిర్మించుకొన్నారు. స్లాబ్ వేసుకోలేని పరిస్థితి, కనీసం రేకులు కూడా వేసుకోలేని పరిస్థితి. అసలే కరోనా సమయం పనికి వెళ్లలేని పరిస్థితి, వచ్చేపెన్షన్ సరిపోక ఏమిచేయాలో తెలియక ఆ మహిళ పరిస్థితి గమనించి మధిర ప్రముఖుల ద్వారా ఆ కుటుంబంనకు ఇంటికి అవసరమైన రేకులకూ ఆర్థిక సహాయం 5000, ఒక నెలకు సరిపడ బియ్యం దయాహృదయులు దాతలు ప్రముఖ వ్యాపారులు మేళ్ల చెర్వు వెంకటేశరావు గారు మైలవరపు వీరభద్రం  రైతు సోదరులు సాంబశివరావు గారు ప్రముఖ ఉపాధ్యాయులు చెడె శ్రీనివాసరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, పల్ల పోతుల నరసింహారావు, పురోహితులు A.రామకృష్ణ శాస్త్రి ఆర్ధిక వితరణతో ఆ మహిళా సోదరికి meo Y ప్రభాకరావు మేడేపల్లి శ్రీనివాసరావు, లంకా కొండయ్యల చేతులు మీదుగా అందించారు. ఈ సందర్బంగా Meo ప్రభాకర్ గారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలనుండి ఆశ భాదిత కుటుంబాలకు వివిధ దాతలు చేత సహాయం చేయిoచటం అభినందనీయo అని, నిజంగా కడుపేదలను ఆదుకున్న వారు ధన్యులు అని తెలిపారు. వితంతు మహిళకూ అన్ని విధాలుగా ఆదుకున్న మధిర దాతలకు కొండయ్య హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు.