బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది

Published: Monday March 28, 2022
ఇబ్రహింపట్నం మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మల్కిజ్ గూడెం గ్రామంలో మహిళా సంఘం (ఐద్వా)  సమావేశం  జరిగింది  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా ఐద్వా  మండల కార్యదర్శి మస్కు అరుణ  పాల్గొన్నారు ఈ సందర్బంగా అరుణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2వ సారి అధికారం లోకి వచ్చాక  మహిళలపైన చిన్న పిల్లల పైన హత్యలు అత్యాచారాలు పెరిగినవి మహిళలకు రక్షణ లేకుండ పోయింది. గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు అడ్డూ అదుపు లేకుండా పెరుగు తుండటంతో నిత్యవసర వస్తువుల రేట్లు పెరిగి మహిళలపై నా పెనుభారం పడుతుంది మహిళలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అరి కట్టడం కోసం మహిళలంతా సంఘటితంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది అనంతరం నూతన కమిటీ వేయడం జరిగింది అధ్యక్షులు గా:- ఏ పద్మ. కార్యదర్శి:- బి లావణ్య. ఏ పావని ఉపాధ్యక్షులు బి అలివేలు. సహాయ కార్యదర్శి కె ఇందిరమ్మ పోషమ్మ యాదమ్మ ముత్తమ్మ తదితరులు ఉన్నారు.