పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి మంత్రి చామకూర మల్లారెడ్డి

Published: Monday June 27, 2022
మేడిపల్లి, జూన్26 (ప్రజాపాలన ప్రతినిధి)
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చని చెట్లను అందిద్దామని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శాంతివనం పార్కులో హరిత పీర్జాదిగూడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి శంకర్ రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం హరిత పీర్జాదిగూడ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి 25వ డివిజన్ కాలనీల వాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పెద్దలు మరియు 25వ డివిజన్ కాలనీలా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ రెడ్డి,రవీంద్ర చారి, హరిందర్ యాదవ్, సత్యనారాయణ,తిరుమలేష్ ఇబ్రహీం,మధు,మోహన్ రెడ్డి, విజయ్,రామాంజనేయులురెడ్డి,మల్లారెడ్డి,రాజు,రవి నాయక్,భాను ప్రకాష్,అశోక్,నరసింహారెడ్డి,రియాజ్,అశోక్ శ్రీనివాస్ చారి,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.