ధారూర్ జాతర వేలం పాటల పార్కింగ్ స్థలం చూపండి

Published: Wednesday November 16, 2022
వేలంపాట బాధితుడు తిరుపతయ్య
వికారాబాద్ బ్యూరో 15 నవంబర్ ప్రజా పాలన : ధారూర్ జాతరకు సంబంధించి పార్కింగ్ వేలం పాట స్థలాన్ని చూపెట్టాలని వేలం పాటలో స్థలాన్ని దక్కించుకున్న యజమాని తిరుపతయ్య అన్నారు. మంగళవారం ధారూర్ మండల పరిధిలోని స్టేషన్ ధారూర్ గ్రామ పంచాయతీలో పార్కింగ్ స్థలం వేలం పాట నిర్వహించగా దానిని రూ.3 లక్షల 60 వేలకు దక్కించుకున్నామని స్టేషన్ ధారూర్ మాజీ సర్పంచ్ వేలంపాట బాధితుడు తిరుపతయ్య అన్నారు. గ్రామ పంచాయతీలో వేలం పాట నిర్వహించే క్రమంలో పార్కింగ్ ప్రదేశంలో నీటి వసతి, వీధి దీపాలు వేస్తామని అన్నారని కానీ ప్రస్తుతం ఏమి లేవని ఆవేదన వ్యక్తంచేశారు.15 నుంచి 20 వరకు ధారూర్ జాతర జరుగుతుండగా ఒక రోజు అయిపోయిన స్థలం ఇంకా అప్పజెప్పలేదని, అధికారుల నిర్లక్ష్యం ఉందని అన్నారు. ఒక రోజు సమయం అయిపోగా దాదాపు రూ.1 లక్ష వరకు నష్టం వచ్చిందని,దానిని ఎవరూ భరిస్తారని ప్రశ్నిచారు.గ్రామ కార్యదర్శి దగ్గర ఉండి పనులు చేయించాల్సింది పోయి ఆమె జాడ కన్పిస్తాలేదన్నారు.పార్కింగ్ కోసం స్థలం కూడా ఎక్కువ చూపిస్తామని చెప్పి,ఇప్పుడు కొంచెం స్థలం చూపించడం ఎంటన్నారు.యువకులకు ఉపాధి ఉంటుంది అనుకోని పార్కింగ్ స్థలం వేలం పాటలో పాల్గొనట్లు తెలిపారు.