మన ఊరు - మన బడి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక

Published: Thursday August 18, 2022
విద్యార్థినీ, విద్యార్థులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యాబోధనతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం నెబ్బెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుచున్న అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ నందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు నన్నద్దమవడంలో పాటించవలసిన కార్యచరణ, బోధనాంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area