కూలీల సమస్యలపై రాష్ట్రవ్యాప్త పోరాటాలకు సిద్ధంకండి.. రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్ పిలుపు

Published: Monday November 28, 2022
తల్లాడ, నవంబర్ 27 (ప్రజా పాలన న్యూస్):
 
 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా జిల్లా వర్క్ షాప్  తల్లాడ మండలంలో హై స్కూల్ నందు పగడపల్లి ఏసు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా బి కే యం యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాల మల్లేష్,   జిల్లా ప్రధాన కార్యదర్శి పోటు ప్రసాద్ పాల్గొన్నారు.
   వారు మాట్లాడుతూ   దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  తర్వాత వ్యవసాయ కూలీలు పేదల జీవితాలు దుర్లభం అయ్యాయని  ధరలు పెరుగుదలతో ఏమి కొనలేని తినలేని పరిస్థితుల్లో భారతదేశం ఆకలి  చావుల వైపు చూస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగ రైతులు మీద ఎటువంటి సబ్సిడీలు లేకపోగా వారిపై  ధరల ఉక్కు పాదం  మోపుతున్నారని జాతీయ ఉపాధి హామీని  200 రోజులకు పెంచాలని ఆయన అన్నారు.
 ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు,  వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ  మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి నిర్మల రైతు సంఘం సీనియర్ నాయకులు నల్లమోతు నరసరావు తల్లాడ మండల కార్యదర్శి ఓర్స్ రమేష్ అఖిల భారత యువజన సమైక్య నాయకులు మద్దోజు శ్రావణ్ కుమార్,  తమ్మరపు వెంకటేశ్వర్లు రామలక్ష్మి చెరుకుకేశ్వరరావు పైదా కిరణ్ జ్యోతి మాజీ ఎంపీపీ వీరభద్రం వేముల రాంబాబు రవీందర్ రమేష్ సైదులు పాల్గొన్నారు.