వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

Published: Saturday November 05, 2022

రాయికల్, నవంబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మరియు కుమ్మరిపల్లి గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్,అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యా నియోజకవర్గ పరిధిలో వర్షాకాలంలో 65 వేల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా  తెలంగాణ రాష్ట్రంలో పంటల విస్తీర్ణం పంటల ఉత్పత్తి పెరిగిందని, నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఆయన అన్నారు. వరి ధాన్యం కొనుగోలు సమయంలో తాలు, తప్పలని కటింగ్ చేస్తే సహించేది లేదని, ప్రతి రైతు నాణ్యమైన వడ్లు తాలు,తప్పలు లేకుండా విక్రయించాలని ఆయన రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జెడ్పిటిసి అశ్విని జాదవ్,పి.ఎ.సి ఎస్.చైర్మన్ రాజిరెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి,ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తె.రా.స మండల పార్టీ అధ్యక్షుడు,కార్యకర్తలు పాల్గొన్నారు .