సంఘ సంస్కరణల మంత్రిత్వ శాఖ ఆవశ్యకత

Published: Saturday May 15, 2021
   సంఘ సంస్కరల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయక పోవడం నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదం. మనం ఉదాత్త ఉన్నత భారత రాజ్యాంగాన్ని ప్రకటించు కున్నాక అందుకనువుగా పాత భావాల నుండి పాత వ్వవస్థల నుండి ఆధునిక సమాజంగా మార్చుకోవడానికి ప్రజలను సంస్కరించే సంఘ సంస్కరణల శాఖను ఏర్పాటు చేయాల్సి ఉండింది. తద్వారా సమాజం ప్రజలు రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాల కనువుగా ప్రజల ఆలోచనలు, సంస్కృతి, ప్రజాస్వామ్యానికనువుగా మార్పు చెందుతారు. రాజరిక, బానిస, భూస్వామ్య, వర్ణ, కుల, జమిందారీ పురుషాధిపత్య అసమానతల, వివక్షల, భావాలలో, జీవన విధానాలలో మార్పు కోసం ఇది అవసరం. ఇప్పటికైనా ప్రతి రాష్ట్రంలో, కేంద్రంలో, ప్రతి జిల్లాలో సంఘ సంస్కరణల శాఖ ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. మా వివాహ దినోత్సవం 17-5-1973) సందర్భంగా నా సందేశం. 
- బి ఎస్ రాములు. శ్యామల.