రాళ్ళచిట్టెంపల్లిలో పోడు భూముల సమస్యల దరఖాస్తుల పరిశీలన

Published: Wednesday October 19, 2022
 మండల రెవెన్యూ అధికారిణి షర్మిల
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజా పాలన : పోడు భూముల సమస్యల గురించి దరఖాస్తు చేసుకున్న రైతుల భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వికారాబాద్ మండల రెవెన్యూ అధికారిణి ( ఎంఆర్ఓ ) షర్మిల అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లిలో గ్రామ సర్పంచ్ ముఫ్ల యాస్మిన్ గౌస్ ఉపసర్పంచ్ శంషుద్దీన్ పంచాయతీ కార్యదర్శి ప్రతిభ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల గురించి దరఖాస్తు చేసుకున్న భూ వివరాలను డిప్యూటీ తహసిల్దార్ శ్రీలత రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ లు ఎం ఆర్ ఓ సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓ మాట్లాడుతూ రాళ్ళచిట్టెంపల్లి గ్రామంలో 169 మంది పోడు భూముల సమస్యల పరిష్కారం గురించి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వాటిలో 85 దరఖాస్తులను క్షుణ్ణంగా టేబుల్ రికార్డ్స్ పరిశీలించి అప్డేట్ చేశామని చెప్పారు. పరిశీలించిన రికార్డ్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో భూ వివరాలను ఏ రైతుకు సంబంధించిన సర్వేయర్ మహేందర్ ద్వారా సర్వే చేయిస్తామని వివరించారు.