వసతి గృహాల్లో వసతులు కల్పించాలి

Published: Tuesday September 06, 2022
 మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 05, ప్రజాపాలన:   వసతి గృహాల్లో వసతులు కల్పించి విద్యార్థులకు న్యాయమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి కి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రోజున వినతి పత్రం అందజేశారు.  
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు  లేక విద్యార్థులకు ఇబ్బందిగా  ఉన్నాయని అన్నారు,  వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం తో విద్యార్థులకు ప్రమాద సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వార్డెన్లు ఫుడ్ ప్రొవిజన్ ఏజెన్సీలతో కుమ్మక్కై ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం బలవర్ధకమైన భోజనం పెట్టడం లేదని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్పందించి సంక్షేమ వసతి గృహాలకు వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
తోట రాజేష్ పి డి ఎస్ యు,చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి యు వి,షేక్ సల్మాన్,చేరాల వంశీ, ఫైథర్ సాగర్, విద్యార్థులు సాయి, రాజు, రాకేష్,రవి తదితరులు పాల్గొన్నారు.