జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుడిగా బనిగండ్లపాడు వాసి కూరపాటి రాజశేఖర్

Published: Monday September 13, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బనిగండ్లపాడు కు చెందిన కూరపాటి రాజశేఖర్ హైదరాబాదులోని సి ఆర్ పి ఎఫ్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడానికి సాంకేతిక నిపుణుడిగా ఎన్నికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ డి. అపర్ణ తెలిపారు. విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ నే తాను కూడా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు, ఎంపికవడంలో చాలా సంతోషంగా ఉందని కూరపాటి రాజశేఖర్ చెప్పారు. బనిగండ్లపాడు గ్రామానికి విచ్చేసిన కూరపాటి రాజశేఖర్ ను బనిగండ్లపాడు గ్రామ ప్రజలు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు