కొండాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ లో భారీ చేరికలు

Published: Monday October 17, 2022
 మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 16 అక్టోబర్ ప్రజా పాలన : కొండాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయని మాజీ మత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామం నుండి 40 మంది యువకులు వివిధ పార్టీల నుండి  పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ సమక్షంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింప చేస్తానని మోసపూరిత మాటలు చెప్పారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కు వంద కేటాయించి అందులోనుండి 50 గ్రౌండ్ వర్క్ జరిగిందని స్పష్టం చేశారు. మిగతా 50 గ్రౌండ్ వర్క్ జరగవలసి ఉందని చెప్పారు. కొన్ని కొన్ని జాగాలో బ్యాంకు వాళ్లు వచ్చి ఎత్తుకొని పోయారని ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ అదనంగా 500 మంజూరు చేశారు. ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు వచ్చినా టిఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు అన్నారు. ఇది మా దాకా రాదని నిరసన తెలుపుతూ వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల ఆర్థిక అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి 10 లక్షల స్కీములు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాటన్నింటిని పక్కకు తోసేసి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు  నారాయణరెడ్డి  కృష్ణారెడ్డి జంగయ్య   తదితరులు పాల్గొన్నారు.