మొండితోక ప్రేమానందంకు శ్రద్దాంజలి

Published: Monday June 07, 2021
మధిర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీశథాయూషు జీవిత కాలము నిలిచి ఇటీవల మరణించిన శ్రీ మొండితోక ప్రేమానందము గారికి లడక్ బజారు దేశ భక్త యువజన సంఘం వారు మొండితోక సుధాకర్ గారి ఇంటిలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ప్రేమానంద గారికి లడక్ బజారు ప్రజలతో ఎన్నో సంవత్సరాల నుండి వున్న అనుబందాన్ని గుర్తు చేసుకొని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేశారు. నివాళులు అర్పించి వారీలో 18 వార్డ్ (లడక్ బజారు) కౌన్సిలర్ శ్రీమతి అరిగె రజనీ, దేశ భక్త యువజన సంఘం భాద్యులు చెరుపల్లి శ్రీధర్, వలిసెట్టి శ్రీనివాస రావు, బత్తుల శ్రీనివాస రావు, దొడ్డా మురళి, P శ్రీనివాస రావు, గుంటూరు రమణారావు, కాశీ రావు గారు, సంగు సత్యనారాయణ, కన్నెధార చంద్ర శేఖర్ పాల్గొన్నారు.