మధిర సేవాసమితి హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలోసేవ యే మా మార్గం సేవ యే మా లక్ష్యం

Published: Monday September 27, 2021
మధిర, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మధిర సేవా సమితి, హరే రామ హరే కృష్ణ నారాయణ సేవ శ్రీధ్యాన చక్ర హీలింగ్ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో పేద మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ మధిర పట్టణ మధిర పరిసర గ్రామల నిరుపేద మహిళలకు ఈరోజు స్థానిక గీతా మందిరంఆవరణ నందు ఆర్థిక సహకారంతో 50% సబ్సిడీ అమౌంట్ తో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కొరకు కుట్టు మిషన్లు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి పట్టణ ఎస్ ఐ సతీష్ కుమార్, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బిక్కి అనిత వ్యాపారవేత్త పుల్ల ఖండం చంద్రశేఖర్, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం మాజీ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా పంపిణీ చేసినారు ఈ సందర్భంగా ఎస్సై సతీష్ కుమార్ మాట్లాడుతూ పేద మహిళలకు సబ్సిడీ మీద కుట్టు మిషన్లు పంపిణీ చేయుట మహిళలకు ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతున్నదని ఈ సందర్భంగా సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా సంస్థలను కొనియాడా ఈ సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో అతిథి టౌన్ ఎస్సై సతీష్ కుమార్ ఘనంగా సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీ పల్లపోతు ప్రసాదరావు, ముప్ప సాని రాధాకృష్ణ, మహంకాళి రామకృష్ణ తిలక్, కోమటిడి శ్రీనివాసరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, యర్రా లక్ష్మణ్, కోమటి సుధాకర్, మహంకాళి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు