జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి

Published: Friday January 27, 2023

* జిల్లాలో 20 మండలాలు 510 రెవిన్యూ గ్రామాలు 580 జిపిలు 4 మున్సిపాలిటీ లు 

* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం వివిధ శాఖలకు తగినన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన ఘటించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు కవాతు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను సభాముఖంగా కలెక్టర్ చదివి వినిపించారు. జిల్లాలో 20 మండలాలు 510 రెవెన్యూ గ్రామాలు 580 గ్రామపంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలలో మొత్తం జనాభా 9 లక్షల 46వేల 109 ఉన్నారన్నారు.
* వైద్య ఆరోగ్యశాఖ : కెసిఆర్ కిట్ పథకం కింద జిల్లాలో 6284 కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. 14,099 మంది గర్భిణీ స్త్రీలకు కేవలం అందించగా అందులో 12,853 మంది గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగడం విశేషమని కొనియాడారు. తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 79,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 9720 మందికి 2 కోట్ల 14 లక్షల  వైద్య సేవలు అందించామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 పరీక్ష కేంద్రాలలో 28వేల 287 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 5040 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.
* పల్లె, పట్టణ సమగ్ర అభివృద్ధి : 
పల్లె పట్టణ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వైకుంఠ ధామాలు స్మృతి వనాలు పెద్దలకు పిల్లలకు ఆహ్లాదకరమైన పార్కులు పచ్చదనం కొరకు నర్సరీల ఏర్పాటు మొక్కల పెంపకం డంపింగ్ యార్డులు ప్రభుత్వ భవనాలకు మరమ్మతులు చేపట్టామని వివరించారు.
* హరితహారం : జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 37 లక్షల 55 వేల  వివిధ శాఖల ద్వారా 292.70 ఎకరాలలో నాటామని స్పష్టం చేశారు.
* మిషన్ భగీరథ పథకం : ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నామని తెలిపారు. 
* వ్యవసాయ రంగం : 97 రైతు వేదికలను 19 కోట్ల 89 లక్షల ఖర్చుతో నిర్మించి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రైతుబంధు పథకం కింద 2 లక్షల 39 వేల 183 మంది రైతులకు 268 కోట్ల 55 లక్షల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేశామని వివరించారు. రైతు బీమా కింద 246 మందికి 12 కోట్ల 80 లక్షల రూపాయలను అందించామని చెప్పారు.
* పౌరసరఫరాల శాఖ ద్వారా యాసంగి సీజన్లో  126 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 17616 మంది రైతుల నుండి 96 వేల 701 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కొరకు 681 చెరువులలో నీటి లభ్యతను బట్టి కోటి 18 లక్షల చేప పిల్లలను 12 లక్షల 66 వేల మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేశామని వివరించారు.
* గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఒక లక్ష 82 వేల 104 మంది కూలీలకు 49 లక్షల 33 వేల 303 పని దినాలు కల్పించి వికారాబాద్ జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపామని కొనియాడారు.
* సంక్షేమ పథకాల ద్వారా కల్యాణ లక్ష్మి పథకం కింద వివిధ వర్గాలకు చెందిన 3067 మందికి 31 కోట్ల 25 లక్షల 25 వేల రూపాయలు షాదీ ముబారక్ పథకం కింద 519 మందికి ఐదు కోట్ల 24 లక్షల 80వేల  రూపాయలను అందించామన్నారు.
* దళిత బంధు పథకం : ద్వారా జిల్లాలోని నియోజకవర్గాలకు 358 మంది దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున దళిత బంధు అందించామని గుర్తు చేశారు.
* విద్యారంగం : ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8 లక్షల 11 వేల ఒక వంద డెబ్బై మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశామని వివరించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలకు మౌలిక వసతులు గదుల మరమ్మతులు నూతన గదుల నిర్మాణం ఫర్నిచర్ మూత్రశాలల నిర్మాణానికి మొదటి విడత కింద 371 పాఠశాలలను ఎంపిక చేసి ఆరు కోట్ల 45 లక్షల వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు.
* ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ : ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 385 సిసి రోడ్ల నిర్మాణానికి 32 కోట్ల 89 లక్షల రూపాయలను కేటాయించామన్నారు.
* రెవెన్యూ ధరణి పోర్టల్ : ద్వారా 61 వేల 608 దరఖాస్తులు రాగా అందులో 54 వేల 763 దరఖాస్తులను పరిష్కరించి మిగతా 6845 దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. 
* అగ్నిమాపక శాఖ :  155 అగ్ని ప్రమాదాలు జరగగా 4 కోట్ల 45 లక్షల 15 వేల రూపాయల ఆస్తులను కాపాడమని తెలిపారు. అగ్ని ప్రమాదాలలో రెస్క్యూటివ్ ద్వారా 11 మంది ప్రాణాలను కాపాడడం కాపాడడం చెప్పుకోదగ్గ విశేషమని ప్రశంసించారు.
* పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ  నిరంతరం కృషి చేసి మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నది అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియాకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.