బిఆర్ఎస్ ఆత్మీయ సమావేశంపై మండిపడ్డ బొమ్మెర కెసిఆర్, కేటీఆర్ ఆదేశాలను ధిక్కరించి ఒంటెద్దు ప

Published: Wednesday April 19, 2023

బోనకల్ ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకీపురం గ్రామంలో మంగళవారం జరిగిన 8 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంపై మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి మండిపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ కలుపుకొని పోవాలని వారు ఆదేశాలు జారీ చేస్తే, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు వారి ఆదేశాలను దిక్కరించి, సీఎం కేసీఆర్ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆత్మీయ సమావేశానికి నల్లమల్ల వెంకటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తిని ఎందుకు పిలవలేదంటూ ఆయన ధ్వజమెత్తారు. లింగాల కమల్ రాజు ఒంటెద్దు పోకడలతో మధిర నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన మాకు బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమావేశానికి ఎందుకు పిలవలేదని, మాకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఉద్యమాన్ని అడ్డుకొని పాల్గొనకపోయినా పదవులనుభవిస్తున్న నీకు ఏ రోజైనా మేము అడ్డు చెప్పామా అంటూ ఆయన అన్నారు.అందర్నీ కలుపుకొని పోయే సోయే లేదంటూ అవాకులు చెవాకులు పేలుతూ,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్లను తనని ఎందుకు పిలవలేదంటూ బోమ్మేర రామ్మూర్తి లింగాల కమల్ రాజుకు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.