మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు.

Published: Friday February 04, 2022
ఫిబ్రవరి 3 క్యాతనపల్లి ప్రజాపాలన ప్రతినిధి : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ మార్కెట్ ఏరియా లో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో యువతకు నిషేధిత డ్రగ్స్ గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసలై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు, మన తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ పిల్లలు చెడు మార్గంలో పడి వారి ఆశలపై నీరు కారుస్తున్నారు అని అన్నారు, యువత వాళ్ల ఇష్టమైన రంగాలలో క్రీడలే కావచ్చు, లలిత కళలు కావచ్చు నచ్చిన రంగాన్ని ఎన్నుకొని నిరంతరం సాధన చేస్తే మంచి ప్రయోజకులు కాగలరని పేర్కొన్నారు, కొంతమంది యువకులు గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది, ఇకపై ఎవరైనా గంజాయి సేవించినట్లు తెలిసినా గంజాయి సాగు చేసిన గంజాయ్ నిల్వ ఉంచిన రవాణా చేసిన చేసినట్టు మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు, వీటిపై ఎవరికైనా సమాచారం ఉంటే 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు అంతేకాకుండా వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వబడును అని తెలియజేశారు, ఎవరైనా ఇంటి స్థలంలో కానీ పొలాల్లో కానీ అసైన్డ్ భూముల్లో కానీ గంజాయి మొక్కలను పెంచినట్టు తెలిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు, గంజాయ్, మాదక ద్రవ్యాలు అరికట్టడం పై పోలీసులకే కాక ప్రజలలో కూడ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఫీలై మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్. ఐ. రషీద్. గన్ మెన్ జంగు. రవి. రవుప్. పోషమల్లు. వెంకటేశ్. ప్రజలు పాల్గొన్నారు.