జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ" ఐకమత్యానికి ప్రతిబింబించింది

Published: Saturday September 17, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలల్లో భాగంగా జిల్లాలో చేపట్టిన ర్యాలీ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రతిబింబించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జన కపూర్ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్దా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, ఎస్పి సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి కొమురం భీం చౌరస్తా, మార్కెట్ ప్రాంతాల నుండి నాలుగు వైపులా విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, దాదాపు 15 వేల మందితో  ర్యాలీ నిర్వహించి, పి, టి, సి, పాఠశాల మైదానానికి చేరుకున్నారు. పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 75 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తుందని తెలిపారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, 18న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఆదివాసి భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సురేష్, డిఎస్పి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area