దొంగల్..దొంగల్ అంటే టి. ఆర్.ఎస్. పార్టీ ఉలికి పాటు*

Published: Friday July 29, 2022
మంచిర్యాల టౌన్, జూలై 28, ప్రజాపాలన : దొంగల్..దొంగల్ అంటే టి. ఆర్.ఎస్. పార్టీ నాయకులు ఉలికి పడుతున్నారని  మంచిర్యాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ సల్ల మహేష్ విమర్శించారు. గురువారం  ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్  రామగిరి బానేష్ లతో కలిసి మాజీ ఎమ్మెల్సీ  ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రేమ్ సాగర్ రావు సైనిక్ పురిలో  భూకబ్జా చేశాడని ఓ ఛానల్ లో వార్త రాగా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత అదే చానల్లో అదేరోజు ఖండన వచ్చిందనే విషయాన్ని తెలిసి కూడా టిఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.,
మంచిర్యాల శ్రీనివాస గార్డెన్స్ సమీపంలోని 324 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి 57 ఎకరాలు తన తండ్రి లక్ష్మణరావు పేరిట ఎలా వచ్చిందో తొలుత ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, టీ.ఆర్.ఎస్ పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.  ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై ఆరోపణలు చేయాలని చూసించారు. ప్రభుత్వ భూమి 57 ఎకరాలు ఎమ్మెల్యే తండ్రి పేరిట ఎలా ఆన్లైన్లో పేరు నమోదు అయిందని కబ్జాకు ఎందుకు ప్రయత్నం జరిగిందని  ప్రశ్నించారు. మంచిర్యాల లోని భూకబ్జాలు బయటపెట్టకుండా ప్రేమ్ సాగర్ రావు పై హైదరాబాదులో భూకబ్జా చేశాడని అసత్య ఆరోపణ చేయడం శోచనీయమని  విమర్శించారు. మున్సిపల్ కౌన్సిలర్ అంకం నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సంయుక్తంగా ఖండించారు. అంకం నరేష్ ప్రేమమ్ సాగర్ రావుపై విమర్శలు చేయడం విశ్వాస ఘాతుకానికి  తార్కానమని అన్నారు . ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తేనే మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యావనే సత్యాన్ని విస్మరించవద్దని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావును తిట్టిన నరేష్ ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరి ప్రేమ్ సాగర్ రావును తిడుతున్నాడని అది ఆయన విశ్వాస ద్రోహానికి నిదర్శనమని అన్నారు. వరద సహాయం గురుంచి ప్రశ్నిస్తే ప్రతి విమర్శలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు. వరద బాధితలకు ఏమేరకు సహాయం చేశారో వరద ప్రాంతాల్లో  చర్చావేదిక పెడదామని  సవాల్ విసిరారు. అభివృద్ధి విషయంలో కానీ మరే విషయంలో కానీ బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సిద్ధమేనని మహేష్ ,బానేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.